పబ్‌పై పోలీసుల దాడులు.. అదుపులో ప్రముఖ సింగర్, నటులు - పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు
06:26 April 03
Raids on Banjara hills Pub: పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు
Raids on Banjara hills Pub: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో నిర్వహిస్తున్న పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హోటల్‌లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌ను అర్థరాత్రి దాటాక కూడా తెరిచి ఉంచినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం వేకువజామున 2.30 గంటల సమయంలో నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సమయానికి మించి పబ్ నడపడంతో పబ్ యజమానులు సహా సుమారు 157 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు సినీ ప్రముఖులూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు దాడి చేసిన సమయంలో కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్‌ఎస్‌డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. తమ అదుపులో ఉన్న యువతీ యువకుల నుంచి పోలీసులు వివరాలను సేకరించిన అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పబ్ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:GANG WAR IN GUNTUR: యువకునిపై అల్లరిమూకల దాడి.. వీడియో వైరల్
TAGGED:
Raids on Radisson Blu Pub