సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండా ఘటనలో భాజపా కార్యకర్తలను పరామర్శించడానికి వచ్చిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు నిరసన సెగ తగిలింది. స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆందోళనకారులు బండి సంజయ్‌ను అడ్డుకోబోయారు. ఈ ఘటనలో మహిళ పట్ల పోలీసులు అసభ్యకరంగా వ్యవహరించారంటూ పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. హుజూర్‌నగర్‌లో బండి సంజయ్ పర్యటనను అడుగడుగునా అడ్డుకున్నారు.
బండి సంజయ్ కారును అడ్డుకున్న స్వేరోస్ సభ్యులు
బండి సంజయ్‌ను అడ్డుకోబోయిన మహిళ పట్ల అసభ్యకరంగా వ్యవహరించారంటూ స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో హుజుర్నగర్లో ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ పర్యటనను అడ్డుకుని నిరసన తెలిపారు.
బండి సంజయ్ కారును అడ్డుకున్న స్వేరోస్ సభ్యులు