మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సంగాయిపల్లికి చెందిన తోట కృష్ణ, నాగరాణిల కుమారుడు వంశీ(13). బుధవారం ఉదయం ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం వరకూ తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెతుకుతుడంగా... గ్రామ శివారులోని వెంకటయ్య కుంటలో బాలుడి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.
అనుమానాస్పద స్థితిలో 13ఏళ్ల బాలుడు మృతి - మెదక్ జిల్లా నేర వార్తలు
ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లి 13 ఏళ్ల బాలుడు... అనుమానాస్పద స్థితిలో గ్రామ శివారులోని ఓ కుంటలో శవమై కనిపించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శంకరంపేటలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో 13ఏళ్ల బాలుడు మృతి
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి... పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వంశీ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాలుడి తండ్రి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కేంద్రం కొత్త పాలసీ.. ఆ వాహనాలిక తుక్కుకే!