సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రధాన రహదారిపై అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లాన్ని, పటికను పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన టాటా ఏసీని తనిఖీ చేసేందుకు ప్రయత్నం చేశారు. డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లాడు.
భారీగా నల్లబెల్లం పట్టివేత.. డ్రైవర్ పరార్ - Suryapeta District Latest News
అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్లబెల్లం, 50 కిలోల పటికను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రధాన రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. టాటా ఏసీని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోవటంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నల్లబెల్లం పట్టుకున్న తుంగతుర్తి పోలీసులు
అప్రమత్తమైన పోలీసులు వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 40 బస్తాల నల్లబెల్లం, 50 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ టాటా ఏసీని వదిలి పారిపోవటంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:బాణామతి నెపంతో దాడి... వ్యక్తి మృతి