FARMER SUICIDE: ఆరుగాలం పండించిన పంటకు సరైన దిగుబడులు రాక పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీర్చేదెలా అని మద్యానికి బానిసై ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బిలోలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆర్మూర్ గంగాధర్ (39) అప్పుల బాధలు భరించలేక పురుగులమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు భైంసా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
FARMER SUICIDE: అప్పుల బాధతో కౌలు రైతు మృతి - అప్పుల భారంతో కౌలురైతు ఆత్మహత్య
FARMER SUICIDE: పండించిన పంటకు సరైన దిగుబడులు రాకపోవడం ఒక వైపు .. చేసిన అప్పులు తీర్చలేననే కారణం మరోవైపు వెరసి మనస్తాపానికి గురైన ఓ కౌలు రైతు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
మృతుడి సోదరుడు మాట్లాడుతూ తన తమ్ముడు ఐదుఎకరాల భూమి కౌలుకి తీసుకొని సాగుచేస్తున్నాడు. దిగుబడి సరిగ్గా రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు.
ఇదీ చదవండి:Woman Suicide in Nirmal : ఉద్యోగం రాలేదని వివాహిత ఆత్మహత్య