Software Employee Commits Suicide: సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరంలోని కొండాపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసుులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అక్షయ్ కుమార్ అనే యువకుడు పదిహేను రోజుల క్రితమే నగరంలోని ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని హైదరాబాద్‌కు వచ్చాడు. కొండాపూర్‌లోని బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచే విధులకు హాజరయ్యేవాడు.
కొండాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య.. 15 రోజుల క్రితమే ఉద్యోగం - సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Software Employee Commits Suicide: ఓ యువకుడు పదిరోజుల క్రితమే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందని నగరానికి వచ్చాడు. బంధువుల ఇంట్లో ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొండాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అక్షయ్‌కుమార్ తండ్రి దేవెేందర్ రెవెన్యూ విభాగంలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అంతకుముందు ఆయన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పీఏగా పని చేశాడు. అలాగే సొంత జిల్లాలో అక్షయ్ కుమార్‌పై పలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అదేవిధంగా యువకుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని పలువురి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన అక్షయ్ కుమార్ ఇవాళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.
ఇవీ చదవండి: