రెమ్డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్ ప్రాంతాల్లో వీరిని వేర్వేరుగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 రెమిడెసివర్ ఇంజెక్షన్లు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన పార్థసారధి అతని అనుచరుడు రామలింగేశ్, బంజారాహిల్స్ వాసులు గిరీశ్ కుమార్, గౌరీ శంకర్, హరీశ్ కుమార్, ముకుందరావు, చిన్నలను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
రెమ్డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
రెమ్డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వేర్వేరుగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వారి నుంచి 32 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
రెమ్డెసివర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే వ్యక్తులు అరెస్ట్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
రెమ్డెసివర్ ఇంజక్షన్లను రూ.25 నుంచి 35 వేల వరకు విక్రయిస్తున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయించే వారిపై తమకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:కట్టడి ఆంక్షలతో చిరువ్యాపారులకు కష్టాలు