తెలంగాణ

telangana

ETV Bharat / crime

Hyderabad Road Accidents: కలకలంరేపుతోన్న వరుస రోడ్డు ప్రమాదాలు... మితిమీరిన వేగమే కారణం? - Road Accidents in Hyderabad

Hyderabad Road Accidents: హైదరాబాద్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. మితిమీరిన వేగం.. మద్యం సేవించి.. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి కారణాలు ఘోర దుర్ఘటనలకు దారి తీస్తున్నాయి. వాహనదారుల తప్పిదాలతో అభంశుభం ఎరుగని వారు దుర్మరణం చెందుతున్నారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు ప్రమాదం జరిగి 24 గంటలు గడవక ముందే... గచ్చిబౌలిలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా... మరొక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

Accidents
Accidents

By

Published : Mar 19, 2022, 6:24 AM IST

కలకలంరేపుతోన్న రోడ్డు ప్రమాదాలు... మితిమీరిన వేగమే కారణం?



Hyderabad Road Accidents: హైదరాబాద్‌లో వరుసగా జరుగుతున్న రోడ్డుప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం రాత్రి 9 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45 వద్ద ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులను ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో గాలిబుడగలు అమ్ముకుంటూ జీవనం సాగించే మహారాష్ట్రకు చెందిన ముగ్గురుమహిళలు గాయపడ్డారు. రెండున్నర నెలల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిని ఆరా తీయగా... ప్రమాద సమయంలో తమతోపాటు వెనుక సీటులో బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహీల్ ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. ఐతే రాహీల్ కోసం యత్నించగా... అతని అందుబాటులో లేదు.

ఎమ్మెల్యే షకీల్ కుమారుడు?

నేరాన్ని అంగీకరిస్తూ వచ్చి పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరూ... చంచల్‌గూడ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వీరిద్దరూ రాహీల్‌కు స్నేహితులని సమాచారం. ఐతే డ్రైవింగ్ సీటులో ఎవరున్నారనే అంశంపై పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి ముందు సైబరాబాద్‌లోనిలో ఓ రెస్టారెంట్‌కు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన జరిగి 20 గంటలు గడవక ముందే గచ్చిబౌలిలోని మరో ప్రమాదంలో ఇద్దరు మహిళలు దుర్మరణం చెందారు.

మహిళ, జూనియర్ ఆర్టిస్ట్...

సైబరాబాద్‌లోని విప్రో చౌరస్తా నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారును... కేపీహెచ్​బీ కాలనీకి చెందిన రోహిత్‌ అనే యువకుడు నడిపిస్తున్నాడు. కారులో అతని స్నేహితురాలు, లఘుచిత్రాల్లో నటించే జూనియర్‌ అర్టిస్ట్‌ గాయత్రి ఉంది. వారు ఉదయం నుంచి హోలీ సంబురాల్లో పాల్గొని... సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో ఇలా హోటల్‌ సమీపంలో కారు అదుపు తప్పి వేగంగా ఫుట్‌పాత్‌ను ఢీకొంది. ఈ క్రమంలో అక్కడే చెట్లకు నీళ్లుపడుతున్న మల్లేశ్వరి అనే మహిళను ఢీకొంది. ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 కిలోమీటర్లకుపైగా వేగంతో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఫుట్‌పాత్‌ను ఢీ కొన్న వెంటనే కారు బోల్తా పడడంతో... ప్రమాదం దాటికి లోపల ఉన్న రోహిత్‌, గాయత్రి బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో రోహిత్‌, గాయత్రిని ఆస్పత్రికి తరలించగా... గాయత్రి మృతిచెందింది. ప్రస్తుతం రోహిత్‌ చికిత్స పొందుతున్నాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు రోడ్డు ఎన్ని చర్యలు చేపడుతున్నా వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి అవసరం ఉందని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details