మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలోని మహాదేవపురంలో కారులో అక్రమంగా తరలిస్తోన్న 50 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. కారుని స్వాధీనం చేసుకున్నారు.
50 కేజీల గంజాయి పట్టివేత.. నిందితుడు అరెస్ట్ - telangana news
జగద్గిరిగుట్ట పరిధిలోని మహాదేవపురంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తోన్న గంజాయిని పట్టుకున్నారు.
marijuana smuggling
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన సంతోశ్(27) కారు డ్రైవర్‌గా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో.. తెలంగాణ-ఆంధ్ర సరిహద్దు నుంచి గంజాయిని హైదరాబాద్‌లోని మియాపూర్‌కు తరలించేవాడని వివరించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి:వ్యక్తి ఆత్మహత్య.. మృతదేహంతో బంధువుల ఆందోళన