తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja seized: ఆంధ్రా టూ తెలంగాణ: రూ.3 కోట్ల గంజాయి స్వాధీనం - ఏపీ క్రైమ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా దబ్బకోట నుంచి తెలంగాణకు తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.3 కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న క్రమంలో... తూర్పుగోదావరి జిల్లా మారేడుపల్లి మండలం వేటుకూరులో స్వాధీనం చేసుకున్నారు.

Seizure of marijuana in east godavari
Seizure of marijuana in east godavari

By

Published : Aug 10, 2021, 12:49 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు కూడలి పెద్ద మొత్తంలో గంజాయి పట్టుకున్నారు. విశాఖ జిల్లా దబ్బకోట నుంచి మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మీదుగా తెలంగాణకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

3 వేల 399 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మొత్తం 3 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 12 మందిని అరెస్టు చేశామని, పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details