శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత - తెలంగాణ వార్తలు
06:48 January 04
Foreign Currency Seized at Shamshabad airport: ప్రయాణికుడి నుంచి రూ.34.49 లక్షలు స్వాధీనం
Foreign Currency Seized at Shamshabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో అధికారులు ప్రయాణికుల లగేజీని సోమవారం రాత్రి సమయంలో తనిఖీ చేయగా... షార్జాకు వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ గుర్తించారు.
ప్రయాణికుడు నసీర్(24) నుంచి రూ.34.49 లక్షలు స్వాధీనం చేసుకున్న సీఐఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు... అతడిని కస్టమ్స్‌కు అప్పగించారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.
ఇదీ చదవండి:Accident In Iron pipes company: ఇనుపపైపుల పరిశ్రమలో ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి..