ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్‌తో దాడి - తెలంగాణ వార్తలు
17:57 July 13
ఉపాధి హామీ అధికారిపై సర్పంచ్ పెట్రోల్‌తో దాడి
నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో ఉపాధి హామీ అధికారిపై పెట్రోల్‌తో దాడి జరిగింది. ఉపాధి హామీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సాంకేతిక సహాయక అధికారి రాజుపై పాతసాల్వి సర్పంచ్ సాయినాథ్ పెట్రోల్‌తో దాడికి పాల్పడ్డారు. రాజుపై ఈ దాడితో చుట్టూ ఉన్న అధికారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ సాయినాథ్ అధికార పార్టీకి చెందినవారని స్థానికులు తెలిపారు.
సాల్వి గ్రామంలో ఓ పని విషయమై మాస్టర్‌లో సంతకం పెట్టాలని సర్పంచ్ కోరడంతో రాజు నిరాకరించినట్లు తెలుస్తోంది. అధికారిపై పెట్రోల్ పోసి నిప్పంటించడం వల్ల గాయాలయ్యాయి. కార్యాలయంలో కొన్ని దస్త్రాలు కాలిపోయాయి. తోటి ఉద్యోగులు మంటలు ఆర్పి... బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. భైంసాలోని ఓ ఆస్పత్రిలో రాజు చికిత్స పొందుతున్నారు. ఈ ఘనటపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజు వద్దకు వచ్చి వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి:పోడు లొల్లి: అటవీ అధికారులపై కర్రలతో గిరిజనుల దాడి