తెలంగాణ

telangana

ETV Bharat / crime

Video Viral: ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు.. మహిళలకు గాయాలు - ఏపీ వార్తలు

ఆర్టీసీ బస్సు, ఓ ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాద ఘటన సీసీటీవీ వీడియో సామాజిక మాద్యమంలో వైరల్​గా మారింది. దీనిపై అనుచిత కామెంట్లు చేయడం పట్ల ట్రాఫిక్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

ACCIDENT VIDEO
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

By

Published : Aug 10, 2021, 9:12 AM IST

ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన బస్సు

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద ఆర్టీసీ బస్సు కింద ద్విచక్ర వాహనం పడిన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజ్​లో రికార్డు అయ్యాయి.

టవర్​ క్లాక్​ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆర్టీసీ బస్సు ఆగింది. సిగ్నల్ పడిన వెంటనే బస్సు ముందుకు బయలుదేరింది. ఇంతలో రాంగ్​రూట్​లో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు మహిళలు బస్సు ముందు వైపు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ లోపే బస్సు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం బస్సు ముందు చక్రం కింద పడింది. ఈ ఘటనలో మహిళల కాళ్లు విరిగిపోయాయి. విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ పోలీసులు మహిళలను ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగం మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్​ అయింది. వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. "నిదానమే ప్రధానము.. ఆలస్యమైనా ముందు వెనకా చూసి ప్రయాణించాలని" క్యాప్షన్​తో వీడియోను షేర్ చేశారు. అనవసరంగా రాంగ్ రూట్లో వస్తే ప్రమాదాల బారిన పడతారని కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:బార్​ ఎదుట యువకుల వీరంగం.. యజమానిపై దాడి

ABOUT THE AUTHOR

...view details