రోడ్డు పక్కనున్న దుకాణాల్లో చొరబడిన ఆగంతుకులు నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద జరిగింది. మంగళవారం రాత్రి సమయంలో మైనింగ్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే దుకాణాల వెనుకవైపు నుంచి చోరీలకు పాల్పడడం విశేషం.
రేకులను కత్తిరించి... దుకాణాల్లో చోరీ - రంగారెడ్డి నేర వార్తలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద వరుస దొంగతనాలు జరిగాయి. హైదరాబాద్ బిజాపూర్ రహదారి పక్కన ఉన్న డబ్బాలలో ఆగంతుకులు చొరబడి నిత్యావసర సరకులు ఎత్తుకెళ్లారు.
chori, chevella, rangareddy
కిరాణా, పాలసేకరణ దుకాణాలతో పాటు మరో రెండు డబ్బాల వెనుకవైపు రేకులను కత్తిరించి చోరీ చేశారు. ఉదయం దుకాణం తెరచి చూడగా.. చోరీ జరిగినట్లు గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:బంజారాహిల్స్లో యువతి కిడ్నాప్ కేసులో సీసీ ఫుటేజ్ లభ్యం