తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లి కోసం దాచిన డబ్బు, 45 తులాల బంగారం చోరీ - theft in Hyderabad

హైదరాబాద్ కుల్సుంపురా పోలీసుస్టేషన్ పరిధిలో దొంగలు హల్​చల్ సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలోని ఐదు ఇళ్లలో చొరబడి 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

theft in Hyderabad, robbery in Hyderabad
హైదరాబాద్​లో చోరీ, కుల్సుంపురాలో చోరీ

By

Published : May 16, 2021, 8:59 AM IST

హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.

చోరీ జరిగిన ఇళ్లను క్లూస్‌ టీమ్‌ పరిశీలించింది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు అపహరణకు గురైందని ఓ ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details