తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident: డీసీఎం డ్రైవర్​ నిర్లక్ష్యం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - road accident took place at tirumalagiri

ఊహించని రోడ్డు ప్రమాదం ఇద్దరిని కబళించింది. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనాన్ని నడిపి కారును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ఘోర ప్రమాదంలో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

road accident
రోడ్డు ప్రమాదం

By

Published : Jun 26, 2021, 8:07 PM IST

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులు ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణ వాసులుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి డివైడర్​ను దాటి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు దూసుకెళ్లడంతో... అటువైపు నుంచి వస్తున్న కారును డీసీఎం వేగంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ముందు కూర్చున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న చివ్వెంల పోలీసులు.. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. డీసీఎం కింద చిక్కుకున్న కారును యంత్రాల సహాయంతో తొలగించారు.

ఇదీ చదవండి:Theft: ఆన్​లైన్​ తరగతుల కోసం ఏర్పాటు చేసిన టీవీని ఎత్తుకెళ్లారు..

ABOUT THE AUTHOR

...view details