Road accident on Keesara ORR: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీకొని ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్‌ఆర్ సర్కిల్ సమీపంలో ఘట్కేసర్ నుంచి వస్తున్న బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టింది. ఇదే సమయంలో ఎదురుగా షామీర్పేట వైపు నుంచి వస్తున్న టాటా కారుని ఢీ కొట్టింది.
Road accident on ORR: రెండు కార్లు ఢీ .. ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్రగాయాలు - మేడ్చల్లో రెండు కార్లు ఢీ
Road accident on Keesara ORR: ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు ఊహించలేరు. అంతా బానే ఉందనుకొనేలోపు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు లేకపోయిన బాధ అనుభవించాల్సి వస్తుంది. అదే విధంగా మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.
కీసర ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకోని.. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల వివరాలు ఇంకా తెలియలేదు.
ఇవీ చదవండి: