వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఏస్, అంబులెన్స్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు వాహనాల్లోనే చిక్కుకుని అరగంట పాటు విలవిలలాడారు. సమాచారం తెలుసుకున్న వర్ధన్నపేట సీఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Accident: ఎదురెదురుగా ఢీకొన్న టాాటా ఏస్, అంబులెన్స్ - రోడ్డు ప్రమాదం వార్తలు
టాటా ఏస్, అంబులెన్స్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలం వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై జరిగింది. వాహనాల్లో ఇరుకున్న క్షతగాత్రులను పోలీసులు గంటపాటు శ్రమించి బయటకు తీశారు.
Accident: ఎదురెదురుగా ఢీకొన్న టాాట ఏసీ, అంబులెన్స్
జేసీబీ, స్థానికుల సహాయంతో రెండు వాహనాల్లో ఇరుక్కున్న క్షతగాత్రులను గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు. వారిని హుటాహుటిన తన పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు సీఐ విశ్వేశ్వర్.
ఇదీ చదవండి:తిమింగలం కడుపులో 'నిధి'- రాత్రికి రాత్రే కోటీశ్వరులైన జాలర్లు