తాగి వాహనం నడపడమే కాదు....రోడ్డుపై నడవడమూ ప్రమాదమే. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం. మద్యం సేవించిన ఓ వ్యక్తి నిజాంపేట్ కూడలిలో రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. వాహనాలకు గ్రీన్ సిగ్నల్ పడినా గమనించక...అలాగే ముందుకు కదలడంతో బస్సు ఢీకొట్టింది.
మద్యం తాగి రోడుమీదికొచ్చాడు.. ప్రాణాలు కోల్పోయాడు
తాగి రోడ్డుపైకి వస్తే ఎంతో ప్రమాదమో ఈ ఘటన మరోసారి నిరూపించింది. తప్పతాగిన ఓ వ్యక్తి సిగ్నల్ పడినా గమనించకుండా రోడ్డు దాటుతుండుగా బస్సు ఢీకొట్టి మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదం
పక్కనే డివైడర్‌పై పడిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మద్యం సేవించిన ఎలాంటి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:అకాల వర్షం... కొట్టుకు పోయిన ధాన్యం