హైదరాబాద్ శివం రోడ్డులో డ్రైనేజి కోసం తవ్విన గుంతలో కారు పడి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయాలపాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు డ్రైనేజీ గుంతలో పడిపోయిన కారు - Hyderabad latest crime news
రోడ్డు డ్రైనేజీ కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు కారు పడిపోయింది. హైదరాబాద్ శివం రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది.
డ్రైనేజీ కోసం తవ్విన గుంతలో కారు ప్రమాదం
అంబర్ పేట్ -6 నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై మట్టి, రాళ్లు ఉండటంతో ఈ ప్రమాదానికి గురైనట్లు క్షతగాత్రుల బంధువులు పేర్కొన్నారు.