ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు. వీరంతా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తి కోతకు వెళ్తుండగా దుర్ఘటన చోటుచేసుకుంది.
Accident: పత్తి కోతకు వెళ్తుండగా ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి - అనంతపురం
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా.. ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మంది గాయపడ్డారు.
Accident
ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను సుబ్బమ్మ, శంకరమ్మ, నాగవేణి, సావిత్రి, చౌడమ్మగా గుర్తించారు. వీరిది గార్లదిన్నె మండలం కొప్పలగొండ.
ఇదీ చూడండి:stab injury: చాయ్ హోటల్లో గొడవ.. ముగ్గురికి కత్తిపోట్లు