తెలంగాణ

telangana

ETV Bharat / crime

బ్లాక్​ మార్కెట్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​ విక్రయం.. నిందితుడి అరెస్ట్​ - Remdeciver injection sale on black market in medchal

కరోనా బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొందరు అక్రమార్కులు మందులు, ఇంజక్లన్లు బ్లాక్‌లో అమ్ముతున్నారు. కుషాయిగూడా పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఇలాంటి దందా చేస్తున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

బ్లాక్​ మార్కెట్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​
బ్లాక్​ మార్కెట్​లో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్​

By

Published : Apr 29, 2021, 3:40 AM IST

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడా పోలీస్​స్టేషన్ పరిధిలో రెమ్​డెసివిర్​ ఇంజక్షన్లు అక్రమంగా విక్రయిస్తున్న శేషు బాబు అనే వ్యక్తిని మల్కాజిగిరి ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 6 రెమ్​డెసివిర్ ఇంజక్షన్, రూ.3490 నగదు, ఒక సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు.

ఒక్కో ఇంజక్షన్​ను రూ.30 వేలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని కుషాయిగూడా పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

ఇదీ చూడండి: ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రూ.కోటికి పైగా నష్టం

ABOUT THE AUTHOR

...view details