ఓ బాధితుడు స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్‌ను సిఫార్సు చేయడంతో రోగి తాలుకా బంధువులు ఓ మధ్యవర్తి ద్వారా రూ.85 వేలకు 5 వయల్స్ కొనుగోలు చేశారు. ఆసుపత్రి సిబ్బందికి అప్పగించగా ఈ ఇంజక్షన్లపై వారికి అనుమానం వచ్చింది. ఆసుపత్రి వైద్యుడు పరిశీలించి వాటిలో నీళ్లు పోసినట్లు గుర్తించారు. వెంటనే బాధితులు ఒకటో ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఆన్‌కాల్ విధులు నిర్వహించే మరో వైద్యుడు సాయి కృష్ణమనాయుడు ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు.
ఏపీలోని శ్రీకాకుళంకు చెందిన ఇతను డబ్బు సంపాదించాలన్న ఆశతో ఖాళీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ సీసాల్లో సెలైన్ సీసాలోని నీళ్లు నింపి కాంపౌండర్ సతీష్‌గౌడ్ ద్వారా రోగులకు విక్రయించినట్లు సమాచారం. నీళ్లు నింపినట్లు విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. ఇటీవల నగరానికి వివిధ ఆసుపత్రులకు సరఫరా అయిన రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఓ ముఠా నల్లబజారులో విక్రయిస్తోంది. వీటిని మహారాష్ట్రకు తరలించిసొమ్ము చేసుకుంటోంది. ఒక్కో వయల్‌ను రూ.35వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతోంది.