తెలంగాణ

telangana

ETV Bharat / crime

దారుణం: మత్తు మందు ఇచ్చి పిన్ని కూతురిపై అత్యాచారం - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌ ఫిలింనగర్‌లో దారుణ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పిన్ని కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

rape-on-young-woman-at-film-nagar-in-hyderabad
దారుణం: మత్తు మందు ఇచ్చి పిన్ని కూతురిపై అత్యాచారం

By

Published : Mar 10, 2021, 7:26 PM IST

హైదరాబాద్ ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వరుసకు సోదరి అయిన ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిఖిల్‌ అనే వ్యక్తి ఫిలింనగర్‌లో నివాసముంటున్న తన పిన్ని ఇంటికి తరుచుగా వస్తుండేవాడు. ఈ క్రమంలో నిందితుడు నిఖిల్ పిన్ని కూతురుపై కన్నేశాడు.

ఒక రోజు పిన్ని ఇంటికి వచ్చిన నిందితుడు... ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి తాగించాడు. ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:పిచ్చికుక్కల స్వైర విహారం... ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details