తెలంగాణ

telangana

ETV Bharat / crime

మహిళపై అత్యాచారయత్నం.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Rape Attempt on Woman: సమాజంలో మానవత్వ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఆడపిల్ల ఒంటరిగా కనపడినా.. వాళ్లకి ముందూవెనుకా ఎవరూ లేరని తెలిసినా.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తున్నారు. అబలలపై అన్యాయాలు జరిగిన ప్రతిసారీ.. సమాజంలో మార్పు రావాలని.. వాటిని వ్యతిరేకిస్తూ ఎన్ని కథనాలు రాసినా, బహిరంగ చర్చలు, సమావేశాలు జరిగినా.. మళ్లీ ప్రతి రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓ మహిళను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో జరిగింది.

మహిళపై అత్యాచారయత్నం.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళపై అత్యాచారయత్నం.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

By

Published : Apr 29, 2022, 11:55 AM IST

Rape Attempt on Woman: మృగాళ్లు రెచ్చిపోతున్నారు... నిత్యం ఏదో ఒకచోట మహిళలపై ఆకృత్యాలకు తెగబడుతున్నారు. మొన్న విజయవాడ, నిన్న గుంటూరు జిల్లాలో మహిళలపై అత్యాచారాలు జరగగా.. తాజాగా గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారయత్నం జరిగిన ఘటన వెలుగుచూసింది. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో మహిళలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని మహిళా సంఘాల నేతలంటున్నారు.

ఏపీలోని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడి ఘటన మరువక ముందే.. మరో మహిళపై అత్యాచారయత్నం వెలుగుచూసింది. శృంగారపురం గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసేందుకు పొలంలోకి తీసుకెళ్తుండగా.. భర్త కేకలు వేయడంతో దుండగుడు మహిళను వదిలేసి పరారయ్యాడు. గ్రామంలో మొక్కజొన్న కోసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది కూలీలు వచ్చారు. గ్రామానికి చెందిన యువకుడు పనికోసం వచ్చిన మహిళను అర్థరాత్రి దాటిన తర్వాత పొలంలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. అది చూసిన భర్తతో పాటు తోటి కూలీలు కేకలు వేయడంతో యువకుడు మహిళను వదిలి పారిపోయాడు. అనంతరం ఘటనపై దుగ్గిరాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆలయ సమీపంలో ఓ ద్విచక్రవాహనం పోలీసులకు కనిపించింది. మహిళను లాక్కెళ్లేందుకు వచ్చిన యువకుడి వాహనంగా గుర్తించారు. బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details