Ragging in Medical College: సూర్యాపేటలోని వైద్య కళాశాలకు చెందిన హాస్టల్లో ఒక విద్యార్థి ర్యాగింగ్‌కు గురైన ఉదంతం కలకలం సృష్టించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి ఇక్కడి వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నారు. ఇంటి నుంచి శనివారం రాత్రి హాస్టల్‌కు చేరుకున్న అతడిని ద్వితీయ సంవత్సరానికి చెందిన దాదాపు 25 మంది విద్యార్థులు తమ గదిలోకి రమ్మన్నారు. అతడి దుస్తులు విప్పించి సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అప్పటికే మద్యం తాగి ఉన్న వారు అతడిపై దాడికి పాల్పడ్డారు.
వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. విద్యార్థి దుస్తులు విప్పించి..
Ragging in Medical College: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా కళాశాలల్లో ర్యాగింగ్ భూతం పడగ విప్పుతూనే ఉంది. సూర్యాపేటలోని వైద్య కళాశాలలో విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవడంలేదని బాధితుడు, అతని తండ్రి ఆరోపించారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ర్యాగింగ్‌పై విచారణకు ఆదేశించారు.
అనంతరం గుండు గీసేందుకు యత్నించగా తప్పించుకొని తన గదికి వెళ్లిన బాధితుడు.. తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. ఆయన వెంటనే 100 నంబరుకు ఫిర్యాదు చేయటంతో స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనలో ఉన్న బాధితుడిని ఠాణాకు తరలించారు. ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు, అతడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్‌రెడ్డిని వివరణ కోరగా.. విద్యార్థులు ఘర్షణ పడిన మాట వాస్తవమేనని విచారణకు నలుగురు హెచ్‌వోడీలను నియమించామన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడినట్లు తేలితే కేసు నమోదు చేయాలని పోలీసులకు చెబుతామన్నారు. ఈసంఘటనపై విచారణ జరుపుతున్నామని ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు చెప్పారు.
ఇదీ చూడండి:Three missing in RK Beach : కన్నోళ్లకు కన్నీటిని మిగిల్చి... కడలిలో గల్లంతైన యువకులు