హైదరాబాద్ జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దొంగలను పోలీసులు పట్టుకున్నారు. సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించగా పోలీసులకు బండి నంబరు దొరికింది. దాని ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఎస్సై మోహన్ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం ఫైరింగ్ కట్ట దగ్గర దొంగలను వెంబడించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Theft arrest: నిఘా నేత్రాల సాయంతో గొలుసు దొంగను పట్టుకున్న పోలీసులు - హైదరాబాద్ తాజా దొంగతనం కేసులు
పోలీసుల దర్యాప్తులో సీసీ టీవీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో రికార్డవుతున్న దృశ్యాలతో దొంగతనాలు, నేరాలు జరిగినప్పుడు నిందితులను పోలీసులు ఇట్టే అరెస్టు చేస్తున్నారు. నిన్న జరిగిన గొలుసు దొంగతనం కేసులో ఒక్క రోజు గడవక ముందే పోలీసులు దొంగలను పట్టుకున్నారు.
నిఘా నేత్రాల సాయంతో గొలుసు దొంగను పట్టుకున్న పోలీసులు
నేరాలు జరిగిన సమయంలో సీసీటీవీలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. దొంతనాలు, హత్యలు, ప్రమాదాలు జరిగిన సమయంలో ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదవుతున్నాయి. దర్యాప్తులో అవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని అంటున్నారు.
ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా