తెలంగాణ

telangana

ETV Bharat / crime

'నా భర్త రాక్షసుడు.. నా శవాన్ని తాకే అర్హత అతనికి లేదు' - బాలాపూర్​లో వేధింపులు తట్టుకోలేక గర్భిణి ఆత్మహత్య

Pregnant Woman Suicide at Balapur : అనుమానంతో భర్త ఎన్ని చిత్ర హింసలు పెట్టినా తట్టుకుంది. ఎవరితో మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టినా భరించింది. తన నిజస్వరూపం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తే భయపడి మౌనంగా ఉండిపోయింది. కానీ తన భర్త రాక్షసుడని తెలుసుకున్న తల్లిదండ్రులు.. సర్దుకుపొమ్మని చెప్పడంతో బాధపడింది. ఇక తనను కాపాడేవాళ్లెవరూ లేరని అనుకుంది. జీవితాంతం ఈ నరకంలో ఉండలేని భావించి ఆత్మహత్యకా పాల్పడింది. తన శవాన్ని భర్త, అత్తామామలు తాకొద్దని.. ఇదే తల్లిదండ్రులుగా తనకు చేసే మేలు అని డైరీలో రాసుకుని ఉరివేసుకుంది.

Pregnant Woman Suicide at Balapur
Pregnant Woman Suicide at Balapur

By

Published : Aug 4, 2022, 10:09 AM IST

Pregnant Woman Suicide at Balapur : భర్త ఉన్మాదాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ మూడునెలల గర్భిణి ఆత్మహత్యకు పాల్పడింది. తన భర్త మానసిక రోగి, రాక్షసుడని, అతడికి తన మృతదేహాన్ని తాకే అర్హత కూడా లేదంటూ డైరీలో రాసుకుంది. ఈ ఘటన హైదరాబాద్​లోని బాలాపూర్​లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి కేసు నమోదు చేసుకున్నారు.

Woman Suicide in Balapur : ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ కథనం ప్రకారం.. షాహిన్‌నగర్‌ జుబైద్‌ కాలనీలో ఉండే దంపతులు ఖాజా మొహియుద్దీన్‌ అన్సారీ, షబానా బేగం దంపతుల ఐదో కుమార్తె ఫిర్దోస్‌ అన్సారీ(29) ఎంబీఏ చదివారు. చార్మినార్‌ ఫతేదర్వాజాకు చెందిన వ్యాపారి సుల్తాన్‌ పటేల్‌(30)తో గతేడాది ఫిబ్రవరి 1న వివాహమైంది. ఎవరితో మాట్లాడినా భర్త అనుమానించి బెల్టు, కర్రతో చితకబాదేవాడు. ఆడబిడ్డ భర్త, ఆయన కుమారులతో మాట్లాడినా విచక్షణారహితంగా కొట్టేవాడు. తన ప్రవర్తన గురించి.. పుట్టింట్లో లేదా మరెవరికైనా చెబితే రివాల్వార్‌తో కాల్చి చంపుతానని బెదిరించే వాడు. ఆమెతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలు అందరికీ చూపిస్తానని హెచ్చరించేవాడు. ఆమెకు రెండుసార్లు గర్భస్రావమైతే ఆనందపడ్డాడు. ఈ విషయాలన్నీ ఆమె డైరీలో రాసుకుంది. ప్రస్తుతం మూడునెలల గర్భవతి. తల్లిదండ్రుల వద్ద ఉండాలని హెచ్చరిస్తూ గత నెలలో పంపించేశాడు.

ఈనెల 1న షాహిన్‌నగర్‌లోని అత్త గారింటికి వచ్చి భార్యను దుర్భాషలాడుతూ చితకబాది వెళ్లిపోయాడు. ఇంతకాలం దాచిన తన భర్త నిజస్వరూపాన్ని పుట్టింటి వారికి వివరించి తనను కాపాడాలని వేడుకుంది. భార్యాభర్తలన్నాక గొడవలుంటాయిలే.. మాట్లాడదాం అంటూ వారు నచ్చచెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వేధింపులకు తాళలేక చనిపోతున్నానని, భర్త, అత్తమామలు.. తన మృతదేహాన్ని తాకకుండా అడ్డుకోవాలని కోరింది. అదే తల్లిదండ్రులుగా మీరు నాకు చేసే మేలు అని డైరీలో రాసింది. తల్లి ఫిర్యాదుపై బాలాపూర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details