సంగారెడ్డి జిల్లాలో హైవే పెట్రోలింగ్ పోలీసుల తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పుల్కల్ మండలం శివంపేట కమాన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుని నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. నిందితుల వద్ద ఉన్న బస్తాలను తనిఖీ చేయగా సుమారు 70 కేజీల ఎండు గంజాయిని గుర్తించామన్నారు.
భారీగా గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ - తెలంగాణ వార్తలు
సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హైవే పెట్రోలింగ్ పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తుల వద్ద తనిఖీ చేయగా 70 కేజీల మత్తు పదార్థాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.
శివంపేట వద్ద గంజాయి పట్టివేత, హైవే పెట్రోలింగ్ పోలీసులు
మహారాష్ట్రకు చెందిన ధన్ సింగ్, ప్రశాంత్, జానూ నారాయణ సింగ్ అనే ముగ్గురు వ్యక్తులు నల్గొండ నుంచి మహారాష్ట్రలోని నాసిక్‌కు మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు జోగిపేట సీఐ శ్రీనివాస్ తెలిపారు. హైవే పెట్రోలింగ్ పోలీసులను సీఐ ప్రత్యేకంగా అభినందించారు.
ఇదీ చదవండి:పురిటి నొప్పులు ఆగవు.. దారేమో కనిపించదు!