మహబూబ్‌నగర్ జిల్లాలో దేవరకద్ర మండలంలో ఈనెల 12న బాలికను అపహరించి.. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న భాజపా నాయకులు డీకే అరుణ ఆధ్వర్యంలో ఎస్పీ రేమ రాజేశ్వరని కలిసి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. నిందితుడిని త్వరగా అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు - అత్యాచారం వార్తలు
బాలికకు మాయమాటలు చెప్పి అపహరించుకుని వెళ్లి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఈ ఘటన జరిగింది.
బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం... నిందితుడి కోసం గాలింపు
ఈనెల 12 న బాలికను అపహరించుకునిపోయి.. సాజిద్ అత్యాచారం చేశాడు. అనంతరం ఈనెల 19 న నవాబ్‌పేటలో బాలికను వదిలి పరారయ్యాడు. బాధితురాలికి వైద్యపరీక్షలు నిర్వహించి నిందితుడిపై ఫోక్సో, అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి:అమ్మను చూడటానికెళ్లి అదృశ్యమైన బాలిక.. ఆచూకీ లభ్యం