న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితులు కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్, శివందుల చిరంజీవిలకు నేడు కస్టడీ ముగిసింది. వారిని మంథని కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితులను 7 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించారు.
బుధవారం రామగుండం అడ్మిన్ డీసీపీ అశోక్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో నిందితులతో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద సంఘటన స్థలానికి తీసుకెళ్లి వామన్‌రావు వాహనాన్ని అడ్డగించిన, హత్య చేసిన తీరుపై (సీన్ ఆఫ్ అఫెన్స్) సమగ్రంగా ఆరా తీశారు. మొత్తం విచారణను వీడియోలో రికార్డు చేశారు.