ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైన కేసును హయత్ నగర్ పోలీసులు 8 గంటల్లోనే ఛేదించారు. బాధితురాలిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఎనిమిది గంటల్లో హయత్ నగర్ బాలిక కిడ్నాప్ కేసు ఛేదన
హయత్ నగర్లో ఓ తొమ్మిదేళ్ల బాలిక కిడ్నాప్ కేసుకు పోలీసులు పోలీసులు 8 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారిస్తున్నారు.
పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం ఆర్కే నగర్లో నివాసముంటున్న రాజు ( 45 ) వృత్తిరీత్యా చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. మద్యం మత్తులో రాజు బాలికను షాపు వద్దకు తీసుకెళ్లి కేకును ఇప్పించాడు. ఆటోలో ఎక్కించుకుని బాలికను సినిమా చూడటానికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికను తీసుకుని వచ్చి హయత్ నగర్‌లోని లెక్చరర్ కాలనీ బస్టాండ్ వద్ద ఉంచాడు. మంగళవారం తెల్లవారుజామున బస్టాండ్‌లో బాలికతోపాటు రాజు నిద్రలేచి చూస్తుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు వెల్లడించారు.కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:'మహా'లో కరోనా పంజా- కొత్తగా 55 వేల కేసులు