thieves gang arrest in Hyderabad: కర్ణాటక హుబ్లీకి చెందిన దార్ల నెహెమియా అలియాస్ బ్రూస్లీ 12 ఏళ్ల వయసులో హైదరాబాద్‌కు వచ్చాడు. నాంపల్లి రైల్వే స్టేషన్‌లో సమీపంలో హోటల్‌లో పనిచేస్తుండగా, అదే సమయంలో అక్కడ జేబుదొంగలు అతనికి పరిచయం అయ్యారు. వారితో కలిసి చిన్ని చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఉండే హాస్టళ్ల వద్దకు రాత్రి వేళల్లో వెళ్లి చరవాణులు, ల్యాప్‌టాప్‌లు దొంగలించే వాడు.
Police Arrested the Thieves gang : ఇలా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, నంద్యాల, సికింద్రాబాద్ జీఆర్‌పీ పరిధిలో వరస చోరీలు చేశాడు. నెహెమియాపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. పలు కేసుల్లో అరెస్టై హుబ్లీ, రాయచూర్ సబ్ జైళ్లలో శిక్ష అనుభవించాడు. హుబ్లీ జైలులో అతనికి పరిచయమైన మందుల శంకర్‌తో కలిసి నేమయ్య హైదరాబాద్‌కు వచ్చాడు. సనత్‌నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.