బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తోన్న ఓ ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల నుంచి.. 5 ఆంపోటేరిసీయాన్-బీ ఇంజక్షన్లు, 6 సెల్ ఫోన్లు, రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్కు తరలించారు.
బ్లాక్లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు.. ముఠా అరెస్టు - బ్లాక్ ఫంగస్ చికిత్స
కష్టకాలంలో ప్రజల అవసరాలను సొమ్ము చేసుకొనేందుకు.. ఓ ముఠా అక్రమ వ్యాపారాలకు పాల్పడింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వినియోగించే ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కింది. ఈ ఘటన హైదరాబాద్, ఎల్బీనగర్లో జరిగింది.
black fungus injections
ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు వివరించారు. అక్రమ వ్యాపారాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Rape case : బాలికపై లైంగికదాడి.. నిందితుడికి జీవిత ఖైదు