తెలంగాణ

telangana

ETV Bharat / crime

cheating: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు

తేలికగా డబ్బు సంపాదించాలని ఐదుగురు ముఠా ఏర్పడ్డారు. భూములకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా ఎనిమిదిన్నర కోట్లు(cheating) కొల్లగొట్టారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్​ పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి 264 నకిలీ డాక్యుమెంట్లు, మహబూబ్‌నగర్ తహసీల్దార్​, ఆర్డీవో పేరుతో ఉన్న 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్, 51 పట్టాదారు పాస్‌బుక్స్‌ స్వాధీనం చేసుకున్నామని సైబరాబాద్​​ సీపీ సజ్జనార్​ వెల్లడించారు.

police, cybarbad
నకిలీ పత్రాలు, పోలీసులు

By

Published : Jun 18, 2021, 6:31 PM IST

నకిలీ పత్రాలు సృష్టించి భూములు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను.. సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 40 ఎకరాల భూమి ఇలాగే విక్రయించి బాధితుల నుంచి ఎనిమిదిన్నర కోట్లు(cheating) కొల్లగొట్టారని సీపీ సజ్జనార్‌ తెలిపారు. వేరే వారి భూమికి నకిలీ పత్రాలు సృష్టించిన ప్రధాన నిందితుడు ఆదినారాయణ మూర్తి... ఎకరం కోటి 40లక్షల రూపాయల చొప్పున 40 ఎకరాలకు 56 కోట్లు రూపాయలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు.

ఇందులో ఎనిమిదిన్నర కోట్లు అడ్వాన్స్ తీసుకొని మోసం చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి బాధితుడు ఆరా తీయగా... ఆదినారాయణ మూర్తి ఇచ్చినవి నకిలీ పత్రాలని తేలాయి. నిందితుల నుంచి 264 నకిలీ డాక్యుమెంట్లు, మహబూబ్‌నగర్ తహసీల్దార్​, ఆర్డీవో పేరుతో ఉన్న 9 రెవెన్యూ స్టాంప్స్, సీల్స్, 51 పట్టాదారు పాస్‌బుక్స్‌ స్వాధీనం చేసుకున్నామని​ సీపీ వెల్లడించారు.

cheating: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు

ఇదీ చదవండి:మద్యం మత్తులో పాదం నరుక్కున్న వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details