తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్​లో రూ.55లక్షలతో డ్రైవర్ పరార్​... ఊటీలో అరెస్ట్ - తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్​లో రూ.55లక్షలతో నగదుతో ఉడాయించిన డ్రైవర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఊటీలో డ్రైవర్​ శ్రీనివాస్​ను, అతని స్నేహితుడు విజయ్​ను అదుపులోకి తీసుకున్నారు. నిందుతుల నుంచి రూ.50లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

police-arrested-a-driver
ఊటీలో అరెస్ట్

By

Published : Sep 30, 2021, 2:36 PM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఈనెల 25న జరిగిన చోరి కేసును పోలీసులు ఛేదించారు. స్థిరాస్తి వ్యాపారికి చెందిన 55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్‌ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ. 50లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

జూబ్లీహిల్స్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి సంతోష్‌ రెడ్డి... కోకాపేట్‌లో ఓ స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలం యాజమానికి 55 లక్షలు చెల్లించమని చెప్పి.... డ్రైవర్ శ్రీనివాస్‌కు కారులో పంపాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారును రోడ్‌ నంబర్‌ 10లో వదిలేసి డబ్బులతో శ్రీనివాస్‌ పరారయ్యాడు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించకపోవటంతో.... సంతోశ్‌ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు... శ్రీనివాస్‌ ఊటిలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడి స్నేహితుడు విజయ్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు.

ఇటీవల ఇళ్లల్లో నమ్మకంగా పనిచేసేవారే మోసం చేస్తున్నారు. యజమానుల దగ్గర నమ్మకం సంపాదించి... వారిని మోసం చేస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్ డబ్బులతో పరార్​ కాగా... గచ్చిబౌలి టెలికాం నగర్​లో నివసించే గోవిందరావు ఇంట్లో కూడా నమ్మకంగా పనిచేసిన వారే దొంగతనానికి పాల్పడ్డారు. పూర్తి వివరాలకోసం ఇది క్లిక్ చేయండి.

ఇదీ చూడండి:Jubilee Hills chori: జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ... రూ.55 లక్షలతో ఉడాయించిన డ్రైవర్

ABOUT THE AUTHOR

...view details