పేకాట రాయుళ్లకు జంటనగరాల పోలీసులు ఊపిరిసలపనీయక పోవటంతో.. జూదమాడేందుకు స్థావరాలు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. ఎక్కడ ఆడినా ఇట్టే పట్టేసుకోవటం వల్ల సురక్షితమైన ప్రదేశాలు లేవని బాధపడుతున్నారు. ఇక్కడ చేయి తిరిగిన ఆటగాళ్లనే నమ్ముకుని ఉన్న అనాధికార క్లబ్‌ల నిర్వాహకులు.. లక్షల్లో జరిగే వ్యాపారాన్ని వదులుకోవటం ఇష్టంలేక ఎన్ని కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సీనియర్మోస్ట్ పేకాట రాయుళ్లకు జూదం అలవాటైపోయి.. ఇక్కడ ఆడలేకపోవటం వల్ల.. మిగితా రాష్ట్రాలు, దేశాలకు పంపించే పనిలో పడ్డారు.
ఎక్కడున్నా పట్టేస్తున్నారు...
జంటనగరాల్లో తిరిగి వేళ్లూనుకుంటోన్న పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులకు దొరకకుండా.. హైదరాబాద్ శివారు ప్రాంతాలను ఎంచుకుంటూ పేకాట రాయుళ్లను నిర్వాహకులు పోగుచేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఖాళీ అయిన అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలోని నివాసాలు, అతిథి గృహాలను సురక్షితంగా భావించి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు క్లబ్ నిర్వాహకులు. అయితే వాటిని కూడా పోలీసులు పసిగట్టి.. ఆటకట్టిస్తున్నారు. ఇటీవల మాదాపూర్, మియాపూర్‌తో పాటు ఇతర శివారు ప్రాంతాలపై ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస దాడులతో... పెద్ద సంఖ్యలో పేకాట రాయుళ్లు, లక్షల రూపాయల్లో డబ్బులు పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం సినీ నటుడు కృష్ణుడుతో పాటు 8 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మరో స్థావరంపై దాడి చేసి సుమారు 18 లక్షల 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బ్యూటీ పార్లర్ పేరుతో మసాజ్ సెంటర్లు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
దారి ఖర్చులిచ్చి మరీ...