పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్ - zp chairman putta madhu arrest news
09:35 May 08
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అరెస్ట్
కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధును రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్నిరోజులు కనిపించకపోవటంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్యకేసులో మధును పోలీసులు విచారించారు.
ఇటీవల వామన్‌రావు తండ్రి మరో ఫిర్యాదు చేయగా... అందులోని అంశాలపై పుట్టమధును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజులుగా పుట్ట మధు అజ్ఞాతంలోకి వెళ్లటం... వామన్‌రావు కేసులో మళ్లీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండటంపై ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చూడండి:న్యాయవాద దంపతుల హత్యకేసులో మరొకరు అరెస్ట్