singareni: మందమర్రి గనిలో బొగ్గుపెళ్ల మీదపడి ఉద్యోగి మృతి - తెలంగాణ వార్తలు
15:25 November 19
మందమర్రి గనిలో బొగ్గుపెళ్ల మీదపడి ఉద్యోగి మృతి
మంచిర్యాల జిల్లా (mancherial district) మందమర్రి ఏరియా కల్యాణి ఉపరితలగనిలో (kkoc project mandamarri) ప్రమాదం జరిగింది. విధుల్లో ఉన్న అధికారిపై బొగ్గు పెళ్లపై పడి మృతి చెందారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో కల్యాణి ఉపరితల గనిలో బొగ్గు పెళ్ల ఊడి పడింది. ఆ సమయంలో మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న అండర్ మేనేజర్ పురుషోత్తం తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. అతడిని హుటాహుటిన రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.
ఘటనా స్థలాన్ని మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పరిశీలించారు. కాగా పది రోజుల వ్యవధిలో మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈనెల 10న శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3లో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆ తర్వాత ఆర్కే 5, ఆర్కే 6 గనుల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి:Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం