Electric Bike Exploded: ఏపీ విజయవాడ సూర్యారావుపేట గులాబీ తోటలో విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా... మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్ అనే వ్యక్తి... నిన్ననే కొత్త ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశాడని బంధువులు తెలిపారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టగా... తెల్లవారుజామున బ్యాటరీ పేలి ఒక్కసారిగా ఇంట్లో మంటలు చెలరేగాయి.
'నిన్ననే కొన్నారు.. ఇవాళ పేలింది.. ఒకరు చనిపోయారు'
Electric Bike Exploded: ఏపీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సూర్యారావుపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గులాబీపేటలో ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో అతడి భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. శివకుమార్ అనే వ్యక్తి నిన్ననే కొత్త బైక్ కొనుగోలు చేయడం గమనార్హం.
Electric
శివకుమార్‌తో పాటు భార్య, ఇద్దరు పిల్లలు మంటల్లో చిక్కుకున్నారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన స్థానికులు... వారిని రక్షించే ప్రయత్నం చేశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా శివకుమార్ మృతి చెందాడు. భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి: