ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ యాదవ్ రావు అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఓ నిండు ప్రాణం బలి - telangana news
డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్‌లో చోటుచేసుకుంది. ఆటోను బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
డ్రైవర్ నిర్లక్ష్యానికి.. ఓ నిండు ప్రాణం బలి
మెరుగైన వైద్యం కోసం ఆటో డ్రైవర్‌ను సమీపంలోని దెగ్లూర్ ఆసుపత్రికి తరలించగా.. మరో ఇద్దరిని నిజామాబాద్‌కు తీసుకువెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బాన్సువాడ డీఎస్పీ పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు