భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లికి చెందిన బొప్పని సురేశ్ తరచు భార్యతో గొడవ పడుతుండేవాడు. దీంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని... ఏడాది క్రితం పుట్టింటికి వెళ్లింది.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య!
భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య
20 రోజుల క్రితం తన తల్లి రాములమ్మ కింద పడటంతో సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సురేశ్ జీవితంపై విరక్తితో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని సోదరి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:మర్రిమిట్ట టేకు ప్లాంటేషన్‌లో చెలరేగిన మంటలు