భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్పల్ప గాయాలు కావడంతో క్షతగాత్రులను వెంటనే సమీపంలోని కొమరారం ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. ఇల్లందు మండలం బొంబాయి తండా సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
Accident: అదుపుతప్పి కారు... ఒకరికి తీవ్ర గాయాలు - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కారు బోల్తా
కారు అదుపుతప్పిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్పల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండా సమీపంలో జరిగింది.
ఇల్లందు మండలం బొంబాయి తండా సమీపంలో కారు బోల్తా
ముగ్గురు బాధితులు అల్లపల్లి మండలం అనంతపురం నుంచి కారులో ఖమ్మం వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదంపై హోంగార్డు వెంటనే ఎస్సై శ్రీధర్‌కు సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. నాగేశ్వరరావు అనే వ్యక్తి వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు.