గంజాయి తరలిస్తున్న వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని సూర్యాపేట జిల్లా తిరుమలగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు శంకర్ పరారీలో ఉన్నాడు. వారి నుంచి 129 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలో 129 కేజీల గంజాయి పట్టివేత
సూర్యాపేట జిల్లా మామిడాల క్రాస్ రోడ్డు వద్ద తిరుమలగిరి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకోగా.. మరో వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి 129 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మామిడాల క్రాస్ రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారని డీఎస్పీ మోహన్ కుమార్ తెలిపారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఎర్ర మోగిలి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడు శంకర్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమలగిరి పోలీసులను డీఎస్పీ అభినందించారు.
ఇదీ చూడండి: తాళం వేసిన ఇంట్లో చోరీ.. నగదు, బంగారం అపహరణ