తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆరుగురిలో ఓ నిందితుడు పరారీ.. ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి..! - jubilee hills gang rape case updates

One Accused Escape: కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులను పోలీసులు ఆరోగ్య పరీక్షల కోసమని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చుట్టూ పోలీసులున్నారు. చేతులకు బేడీలు కూడా వేసి ఉన్నాయి. తీరా.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్దామని చూస్తే కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. వాహనాల్లో నుంచి వైద్యుల దగ్గరికి తీసుకొచ్చేలోపు.. ఓ నిందితుడు అందరి కళ్లుగప్పి తప్పించుకుపోయాడు..

One of six Accused Escaped from hospital before going to court at uppal
One of six Accused Escaped from hospital before going to court at uppalOne of six Accused Escaped from hospital before going to court at uppal

By

Published : Jun 11, 2022, 8:58 PM IST

One Accused Escape: హైదరాబాద్​లో పోలీసుల‌ అదుపులో ఉన్న ఓ నిందితుడు.. పోలీసుల కళ్లుగప్పి పారిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ నిందితుడు తప్పించుకున్న విషయం కూడా పోలీసులకు కాసేపటి తర్వాత గానీ తెలియలేదు. నిందితుడు తప్పించుకున్నట్టు గుర్తించగానే.. చుట్టుపక్కన ఉన్న పరిసరాల్లో వెతికినా లాభం లేకపోకపోయింది. చేసేదేమీ లేక ఈ విషయాన్ని సిబ్బంది.. ఉన్నతాధికారులకు తెలియజేశారు. అజాగ్రత్తగా వ్యవహరించినందుకు ఆ పోలీసులపై ఉన్నతాధికారులు అక్షింతలు వేశారు.

గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు నిన్న(శుక్రవారం) ఉప్పల్​లోని చిలుకానగర్​లో ఓ ఇంటిపై దాడి చేసి ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను శనివారం కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిందితులకు ఆరోగ్యపరీక్షలు చేసేందుకు పోలీస్​స్టేషన్ పక్కనే ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. నిందితుల చేతులకు బేడీలు వేసి.. మరీ తీసుకెళ్లారు.

ఆస్పత్రి ప్రాంగణంలోకి వెళ్లాక.. కాసేపటి తర్వాత వైద్యుని దగ్గరికి తీసుకెళ్దామని చూస్తే.. ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆరుగురిలో.. ప్రశాంత్ అనే నిందితుడు కనిపించలేదు. ఎటువెళ్లాడని ప్రాంగణమంతా వెతికారు. చివరికి పారిపోయాడని పోలీసులు గ్రహించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోనూ వెతికారు. కానీ.. లాభం లేదు. ఇక చేసేదేమీ లేక నిందితుడు తప్పించుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించి.. ఎస్సైలు, సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం వరకు పారిపోయిన నిందితుడు ఆచూకీ తెలియకపోవడంతో ఎస్కార్ట్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంపై పోలీసు సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details