తెలంగాణ

telangana

ETV Bharat / crime

Accident : సైకిల్​ను ఢీకొట్టిన మొబైల్ క్రేన్.. కార్మికుడు మృతి - telangana news

సంగారెడ్డి జిల్లా లక్డారం రహదారిపై సైకిల్​పై వెళ్తున్న ఓ కార్మికుడిని ఎదురుగా వస్తున్న క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు మృతి చెందాడు.

sangareddy district news, accident in sangareddy
సంగారెడ్డి జిల్లా వార్తలు, సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : May 30, 2021, 9:13 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన బుచ్చయ్య(62) పెన్నార్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు . శనివారం రాత్రి పరిశ్రమలో విధులకు వెళ్లాడు. విధులు ముగించుకుని ఆదివారం రోజు సైకిల్​పై తిరిగి వస్తుండగా.. లక్డారం జాతీయ రహదారిపై మొబైల్ క్రేన్ అతివేగంగా వచ్చి కార్మికుడిని ఢీకొట్టింది.

ఈ ఘటనలో కింద పడిన బుచ్చయ్యను లారీ కొద్దిదూరం ఈడ్చుకెళ్లడం వల్ల అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన ఓ వ్యక్తి క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే బుచ్చయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details