Medchal Car Accident : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో చెట్టును కారు ఢీకొట్టగా అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు బహదూర్‌పల్లికి చెందిన ఎలుగారి బాలకృష్ణగా గుర్తించారు. బహదూర్‌పల్లి నుంచి దూలపల్లి వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు వెనుకభాగం నుజ్జునుజ్జయింది. రెండురో జుల క్రితం గచ్చిబౌలిలోనూ కారు చెట్టును ఢీకొట్టగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Medchal Car Accident : చెట్టును ఢీకొని కారు నుజ్జునుజ్జు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - తెలంగాణ వార్తలు
Medchal Car Accident : అతివేగంతో చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయాలపాలయ్యారు.
చెట్టును ఢీకొన్న కారు
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం సేవించి వాహనం అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suspect Death in AP : అటవీ శాఖ డైరెక్టర్ కుమారుడు అనుమానాస్పద మృతి