తెలంగాణ

telangana

ETV Bharat / crime

బస్సును ఓవర్​టేక్ చేసి  కారును ఢీకొట్టి.. - bike accident in karimnagar

ఆర్టీసీ బస్సును ఓవర్​టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తోన్న కారును ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందగా.. మరో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా నగునూరు రైతువేదిక సమీపంలో చోటుచేసుకుంది.

bike accident, karimnagar
బైక్ యాక్సిడెంట్, కరీంనగర్​లో ప్రమాదం

By

Published : Apr 6, 2021, 9:11 AM IST

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామానికి చెందిన మణిదీప్(17), తన ద్విచక్రవాహనం రిపేర్​ కోసమని పదోతరగతి విద్యార్థి పన్నాల విష్ణుతో కలిసి కరీంనగర్​కు వెళ్లారు. బైక్​ మరమ్మతు చేయించుకుని ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో కరీంనగర్​ గ్రామీణ మండలం నగునూరు రైతు వేదిక సమీపంలో.. ఆర్టీసీ బస్సును ఓవర్​టేక్ చేస్తుండగా.. ఎదురుగా వస్తున్న కారును ఢీకొన్నారు. వేగంగా ఢీకొనడం వల్ల 20 అడుగుల దూరాన పడిపోయారు.

ఇద్దరి తలలకు బలమైన గాయాలు కాగా.. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణిదీప్ మృతి చెందాడు. విష్ణు కరీంనగర్​లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details