ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. కూరగాయల మాటున తరలిస్తున్న గంజాయి గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశాఖపట్నం నుంచి వరంగల్‌కు వ్యానులో తరలిస్తుండగా సత్తుపల్లి వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు పట్టుకున్నారు.
అడ్డంగా దొరికిపోయారు
ఏపీలోని విశాఖ జిల్లా భూపాలపట్నం ప్రాంతానికి చెందిన ఎడమ కంటి శ్రీనివాస్ రెడ్డి... వరంగల్ జిల్లా బాలసముద్రానికి చెందిన ప్రేమ దాసుకు గంజాయి విక్రయించాడు. సరకును తరలించేందుకు పక్కాప్రణాళిక అమలు చేశారు. కాని అడ్డంగా దొరికిపోయారు. వ్యానులో మొదట గంజాయి నింపి ఎవరికీ అనుమానం రాకుండా చివర్లో కూరగాయలు నింపారు. అనుమానమొచ్చిన పోలీసులు వ్యానును, ఎస్క్రార్ట్గా వచ్చిన మరో కారును క్షుణ్ణంగా తనిఖీలు చేయాగా... 631 కేజీల గంజాయి దొరికింది.
గంజాయి తరలిస్తున్న శ్రీనివాస్ రెడ్డితో పాటు కారు డ్రైవర్ అనంతుల సందీప్, వ్యాన్ డ్రైవర్ అర్జునుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వ్యాను, కారు, నాలుగు చరవాణులు, రూ.800 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రేమదాసు పరారయ్యాడని ఏసీపీ తెలిపారు. పెద్దమొత్తంలో గంజాయి పట్టుకున్న సీఐ రమాకాంత్, ఎస్సై నరేష్ ఇతర సిబ్బందిని అభినందించి.. రివార్డు ప్రకటించారు. మాదక ద్రవ్యాలు అక్రమరవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి:విద్యుదాఘాతంతో ఒంటె మృతి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబం