ఇస్సపాలెంకు చెందిన బండ్లమూరి వెంకాయమ్మ (90) అనే వృద్ధురాలికి.. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే తొమ్మిది ఎకరాల పొలం ఉంది. ఆస్తి కాజేసేందుకు.. వరుసకు ఆమెకు మనవడైన బండ్లమూరి కోటయ్య అనే వ్యక్తి.. 2018లో వెంకాయమ్మ చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు సృష్టించాడు. 2020లో వృద్ధురాలి ఆస్తిని.. తప్పుడు ధ్రువపత్రాలతో కోటయ్య తన పేరుపైకి మార్చుకున్నట్లు.. వెంకాయమ్మ నరసరావుపేట ఆర్డీవోకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరింది.
Complaint: ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం
ఆస్తికోసం బతికున్న వృద్ధురాలి పేరు మీద చనిపోయినట్లు తప్పుడు ధ్రువపత్రం సృష్టించాడు ఓ ప్రబుద్ధుడు. ఆమెకున్న రూ.20కోట్ల ఆస్తిని సొంత మనవడే కాజేశాడు. తప్పుడు పత్రాలతో తన ఆస్తిని కాజేశారని.. న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు పోరాడుతోంది.
Complaint: ఆస్తి కోసం మనవడి నిర్వాకం.. బతికున్న వృద్ధురాలు చనిపోయినట్లుగా తప్పుడు ధ్రువపత్రం